![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -489 లో... అందరూ భోజనం చేస్తుంటే కృష్ణ మాత్రం దిగులుగా ఆలోచిస్తూ ఉంటుంది. రేవతి ఏం ఆలోచిస్తున్నావని అడుగుతుంది. అసలు ఏమి పట్టనట్టు ఏం జరగనట్టు ఎలా భోజనం చేస్తున్నారని అడుగుతుంది. లేకపోతే మీ భార్యాభర్తలు చేసిన ఘనకార్యానికి తిండి తిప్పలు మానేసి పస్తులు ఉండమంటావా? అని ఆదర్శ్ కోపంగా అడుగుతాడు. నన్ను దోషిలా చూస్తూ నేరస్థురాలిగా లెక్కకడుతున్నారా అని కృష్ణ భవానీని నిలదీస్తుంది. ఆమె మౌనంగా ఉండటంతో కృష్ణ కోపంగా అరుస్తుంది. ఎందుకంత ఆవేశమని మధు అంటాడు. తన కడుపులో పెరుగుతుంది నా బిడ్డ అని చెప్తున్నా వినకుండా మోసం చేసిన దాన్ని పక్కనే కూర్చోబెట్టుకుని తింటున్నారని కృష్ణ అరుస్తుంది.
నువ్వు నేరస్థురాలివే, నా భర్తని దక్కించుకోవడానికి నా బిడ్డను నీ బిడ్డ చేసుకోవడం కోసం నా భర్తతో లేని సంబంధం ఉన్నట్టు క్రియేట్ చేయాలని చూస్తున్నావ్. నువ్వు నేరస్థురాలివే అని కృష్ణ గట్టిగా అంటుంది. ఇందుకే నేను వెళ్లిపోతానని అన్నాను కానీ ఇంట్లో ఉంచి సాధిస్తున్నారని ముకుంద డ్రామా ఆడుతుంది. తల్లి కాబోతున్న నేను ఎంత ప్రశాంతంగా ఉండాలి. కానీ మీరు నన్ను ఇలా మాటలు అంటుంటే నాతో పాటు నా కడుపులోని బిడ్డ ఏమవుతుందని అంటుంది. నీ నంగనాచి వేషాలు ఆపమని కృష్ణ ఆవేశంగా మాట్లాడుతుంది. తప్పు చేసిన వాళ్ళే ఇలాంటి మాటలు మాట్లాడతారని ఆదర్శ్ అంటే కృష్ణ తన నోరు మూయిస్తుంది. కాసేపు ఇద్దరు గొడవపడతారు. మీరా వాడుతున్న ట్యాబ్లెట్లు చూసిన కృష్ణ వాటిని మధుకి చూపిస్తుంది. అవి ఎముకలు విరిగితే వేసుకుంటారని చెప్పగా.. మధు షాక్ అవుతాడు. అయితే మీరాని ఫాలో అవుతే మురారి జాడ తెలుస్తుందని ఇద్దరు అనుకుంటారు.
మరోవైపు మురారికి ట్యాబ్లెట్స్ వేయాలని టైమ్ అవుతుందని మూరా కంగారుగా బయటకు వస్తుంటే అక్కడే భవాని ఎదురుపడుతుంది. తనని చూసి మీరా షాక్ అవుతుంది. నెలతప్పిన దానివి కదా అంత హడావుడిగా నడుస్తున్నావేంటని భవాని అడుగుతుంది. డాక్టర్ అప్పాయింట్ మెంట్ ఉందని, టైమ్ అవుతుందని చెప్తుంది. కడుపుతో ఉన్న దానివి అంత కంగారుగా ఎందుకు వెళ్ళడం, కృష్ణ ట్రీట్ మెంట్ ఇస్తానని చెప్పింది కదా మళ్ళీ వెళ్ళడం ఎందుకని అడుగుతుంది. కొన్ని టెస్ట్ లు చేశారు.. రిపోర్ట్స్ ఈ రోజు వస్తాయని వాటిని తీసుకుని ఇక రానని చెప్పి వస్తానని అంటుంది. ఆ అవసరం కూడా లేదని కృష్ణ ఫోన్ చేస్తే ఇంటికి పంపిస్తారని భవాని చెప్తుంది. ఆ తర్వాత వెళ్ళు డాక్టర్ తో చెప్పి వస్తానని అన్నావ్ కదా అని పంపిస్తుంది. మరోవైపు ముకుంద దగ్గర నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలని మురారి ఆలోచిస్తుంటాడు. తరువాయి భాగంలో ముకుందను కృష్ణ ఫాలో అయి మురారి దగ్గరకు చేరుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |